‘డియర్ శివాత్మిక.. ధైర్యంగా ఉండు’ అంటూ రాజశేఖర్ కూతురికి చిరంజీవి ట్వీట్!
- రాజశేఖర్‌కు ఆసుపత్రిలో చికిత్సపై చిరు స్పందన
- డా.రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను
- ఆయనకు, మీ కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి
శివాత్మిక చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేస్తూ... ‘డియర్ శివాత్మిక.. మీ తండ్రి, నా సహచరుడు, స్నేహితుడు డా.రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఆయనకు, మీ కుటుంబానికి మా ప్రార్థనలు తోడుంటాయి.. ధైర్యంగా ఉండు’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా, రాజశేఖర్ కుటుంబ సభ్యులందరికీ ఇటీవల కరోనా వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రాజశేఖర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.