అమీర్ ఖాన్ పక్కటెముకకు గాయం?
- అమీర్, కరీనా జంటగా 'లాల్ సింగ్ చద్దా' సినిమా
- ఢిల్లీ షూటింగ్ లో గాయపడ్డ అమీర్
- పెయిన్ కిల్లర్లు తీసుకుని షూటింగులో పాల్గొంటున్న వైనం
ఢిల్లీలో షూటింగ్ జరుగుతుండగా అమీర్ గాయపడినట్టు బీటౌన్ టాక్. అమీర్ పక్కటెముకలకు గాయమైనప్పటికీ... పెయిన్ కిల్లర్లు తీసుకుని ఆయన షూటింగ్ ను కొనసాగిస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో తమిళ నటుడు విజయ్ సేతుపతి కూడా నటిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేయాలనే లక్ష్యంతో యూనిట్ ఉంది. ఈ నేపథ్యంలోనే బ్రేక్ లేకుండా షూటింగ్ నిర్వహిస్తున్నారు.