సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సంక్రాంతికి 'సుల్తాన్'తో వస్తున్న రష్మిక
- టాలీవుడ్ దర్శకుడితో 'కేజీఎఫ్' హీరో!
- రవితేజ సినిమా నుంచి తప్పుకున్న నిధి
* 'కేజీఎఫ్' సినిమా ద్వారా ఒక్కసారిగా దేశ వ్యాప్తంగా పేరుతెచ్చుకున్న హీరో యశ్ త్వరలో ఓ తెలుగు దర్శకుడి చిత్రంలో నటించనున్నాడు. సాయి కొర్రపాటి నిర్మించే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలను విజయదశమికి ప్రకటిస్తారు. యశ్ ప్రస్తుతం 'కేజీఎఫ్ 2' చిత్రంలో నటిస్తున్నాడు.
* ప్రస్తుతం 'క్రాక్' చిత్రంలో నటిస్తున్న రవితేజ తన తదుపరి చిత్రాన్ని రమేశ్ వర్మ దర్శకత్వంలో చేయనున్నాడు. ఇందులో ఇప్పటికే ఓ కథానాయికగా నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారు. అయితే, ఇప్పుడు నిధి తప్పుకోవడంతో, ఆ స్థానంలో మీనాక్షి చౌదరిని తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.