మా కుటుంబం మొత్తానికి సినిమాయే ప్రాణం: అల్లు ఫ్యామిలీ
- నేడు అల్లు రామలింగయ్య 99వ జయంతి
- హైదరాబాదులో అల్లు స్టూడియోస్ కు శ్రీకారం
- ప్రకటన చేసిన అల్లు కుటుంబం
అల్లు రామలింగయ్య ఘనవారసత్వాన్ని కొనసాగించేందుకు తమకు సినిమానే మార్గమని ఈ ప్రకటనలో వివరించారు. అల్లు స్టూడియోస్ ను ఆయన జ్ఞాపకార్థం అంకితమిస్తున్నామని ప్రకటించారు. అందరి ఆశీస్సులు, శుభాకాంక్షలతో ఈ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేశామని తెలిపారు.
హైదరాబాద్ గండిపేట ప్రాంతంలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టూడియో రూపుదిద్దుకోనుంది. అత్యాధునిక సౌకర్యాలతో సినీ, టెలివిజన్ చిత్రీకరణకు అనువుగా ఉండేలా ఈ స్టూడియో నిర్మానం ఉండనుంది .