హేమంత్ హత్య కేసులో మరో కీలక విషయం వెలుగులోకి
- ఈ ఏడాది జూన్10న అవంతి, హేమంత్ ప్రేమ వివాహం
- వారిని విడదీసేందుకు రెండు నెలలపాటు ప్రయత్నం
- ఓ గ్యాంగ్ తప్పుకోవడంతో మరో ముఠాతో ఒప్పందం
ఈ ఏడాది జూన్ 10న అవంతి, హేమంత్‌లు వివాహం చేసుకున్నారు. దీంతో తట్టుకోలేకపోయిన అవంతి కుటుంబ సభ్యులు వారిని విడదీసేందుకు ప్రయత్నించారు. అవంతిని తమవైపు తిప్పుకునేందుకు దాదాపు రెండు నెలలపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో హేమంత్‌ను కిడ్నాప్ చేసి బెదిరించి విడదీయాలని భావించారు. అందులో భాగంగా యుగంధర్ రెడ్డి ఓ గ్యాంగును సంప్రదించాడు. అయితే, ఆ ముఠా తప్పుకోవడంతో బిచ్చూ యాదవ్ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని హత్య చేయించాడు. కాగా, అవంతి తండ్రి లక్ష్మారెడ్డి జైలులో ఉండడంతో అతడు నిర్వహిస్తున్న రేషన్ దుకాణం మూతబడింది.