హేమంత్‌ను పెళ్లి చేసుకుంటే విషం పెట్టి చంపేస్తామని మా అమ్మ చెప్పింది: అవంతి
- నా తల్లిదండ్రులను ఎన్‌కౌంటర్ చేసి చంపేయండి
- నాకు న్యాయం చేయాలి
- హేమంత్‌తో ఎనిమిదేళ్ల నుంచి పరిచయం ఉంది
- అన్యాయంగా చంపేశారు
తమకు ఇష్టంలేని పెళ్లి చేసుకుంటే తినే అన్నంలో విషం పెట్టి చంపేస్తామని తన తల్లి గతంలో చెప్పిందని అవంతి తెలిపింది. తాను తన ఇష్టపూర్వకంగానే హేమంత్ వద్దకు వచ్చానని, తమ జీవితాన్ని తాము హాయిగా గడుపుతున్నామని చెప్పింది. తన భర్త హేమంత్ ఎవరినీ మాటలతో కూడా నొప్పించడని ఆమె చెప్పింది.
అన్యాయంగా తన భర్తను చంపేశారని తెలిపింది. తన పుట్టింటి వాళ్లు ధనబలం చూపిస్తారని చెప్పింది. తనకు హేమంత్‌తో ఎనిమిదేళ్ల నుంచి పరిచయం ఉందని, తాము ఇంటర్ చదువుతున్నప్పుడే ఆ అబ్బాయిని కలవద్దని తల్లిదండ్రులు చెప్పడం మొదలుపెట్టారని తెలిపింది. కొన్ని నెలల క్రితం ఇంట్లో బంధించారని, అనంతరం ఈ మూడు నెలల్లో అంతా జరిగిపోయిందని ఆమె చెప్పింది. తన దృష్టిలో తన తల్లిదండ్రులు చచ్చిపోయారని వ్యాఖ్యానించింది.