ప్రభాస్ 'ఆదిపురుష్' సినిమాకు సంబంధించి అప్ డేట్!
- భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 'ఆదిపురుష్'
- ప్రభాస్ సరసన నటిస్తున్న దీపికా పదుకొణే
- లక్ష్మణుడి పాత్రలో దక్షిణాదికి చెందిన యువ హీరో
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి మరో వార్త వినిపిస్తోంది. రాముడి తమ్ముడైన లక్ష్మణుడి పాత్రలో దక్షిణాదికి చెందిన ఓ యువ నటుడు నటిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఆ ఛాన్స్ ఎవరికి దక్కిందా? అనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం.