మన ధర్మం మన బాధ్యత... అంటూ తల్లి ఫొటో పోస్టు చేసిన రామ్ చరణ్
- ధర్మాన్ని పరిరక్షిద్దాం అంటూ పవన్ పిలుపు
- పరమత సహనానికి తనదైన భాష్యం
- భారతీయ సంస్కృతి కూడా విలువైనదేనంటూ చెర్రీ ట్వీట్
మన సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అంటూ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ తన తల్లి సురేఖ ఫొటోను కూడా పంచుకున్నారు. హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉన్న తులసి చెట్టుకు సురేఖ పూజ చేస్తుండడాన్ని ఆ ఫొటోలో చూడొచ్చు. భారతీయ సంస్కృతి కూడా విలువైనదే (భారతీయ కల్చర్ మ్యాటర్స్) అంటూ చెర్రీ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. మొత్తమ్మీద బాబాయ్ భావజాలాన్ని అబ్బాయ్ కూడా అనుసరిస్తున్నట్టు అర్థమవుతోంది.