శర్వానంద్ తదుపరి సినిమాపై ఏకే ఎంటర్టైన్ మెంట్ అధికారిక ప్రకటన
- శర్వా తదుపరి చిత్రం 'మహాసముద్రం'
- ఏకే ఎంటర్టైన్ మెంట్ బ్యానర్ పై తెరకెక్కనున్న చిత్రం
- దర్శకత్వం వహించనున్న అజయ్ భూపతి
'ఆర్ఎక్స్100' వంటి చిత్రాన్ని తెరకెక్కించిన అజయ్ భూపతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో శర్వాతో పాటు మరో హీరో కూడా కనిపించనున్నట్టు సమాచారం. ఫుల్ ప్యాకేజ్డ్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం వస్తున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. 'సరిలేరు నీకెవ్వరు' చిత్రం తర్వాత తమ బ్యానర్ నుంచి వస్తున్న మరో క్రేజ్ ప్రాజెక్ట్ అని తెలిపింది.