సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- ధైర్యం చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్
- ఓటీటీ ద్వారా విశాల్ సినిమా 'చక్ర'
- మళ్లీ వస్తున్న కలర్స్ స్వాతి
* విశాల్ హీరోగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'చక్ర' చిత్రాన్ని డైరెక్టుగా ఓటీటీ ద్వారా రిలీజ్ చేయనున్నారు. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'జీ5' ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఇందులో 'జెర్సీ' ఫేం శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది.
* కథానాయిక కలర్స్ స్వాతి మళ్లీ వస్తోంది. గతంలో కొన్ని సినిమాలలో కథానాయికగా నటించిన ఈ చిన్నది పెళ్లయిన తర్వాత నటనకు దూరమైంది. ఇప్పుడు మళ్లీ ఓ వెబ్ సీరీస్ లో నటించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.