ప్రభాస్ 'ఆదిపురుష్'లో కథానాయికగా కీర్తిసురేశ్?
- ప్రభాస్ నటిస్తున్న తొలి హిందీ చిత్రం 'ఆదిపురుష్'
- 'తానాజీ' ఫేం ఓం రౌత్ దర్శకత్వం
- రామాయణాన్ని నేటి పరిస్థితులకు అన్వయింపు
- సీతాదేవి పాత్ర విషయంలో కుతూహలం
విష్ణు అవతారమైన రాముడి పాత్రను పోలిన పాత్రను ఇందులో ప్రభాస్ పోషిస్తాడని తెలుస్తోంది. రామాయణాన్ని నేటి సాంఘిక పరిస్థితులకు అన్వయిస్తూ ఈ చిత్రం రూపొందుతుందని అంటున్నారు. అంటే సోషియో ఫాంటసీగా కూడా వుండే అవకాశాలు వున్నాయని చెప్పచ్చు. ఇక ఇందులో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తుండగా, అతని సరసన సీతాదేవి వంటి పాత్రను ఎవరు పోషిస్తారనే విషయం ఇప్పుడు అందరిలోనూ కుతూహలాన్ని రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పాత్రకు కీర్తి సురేశ్ ని చిత్ర నిర్మాతలు పరిశీలిస్తున్నట్టు తాజాగా ప్రచారం జరుగుతోంది. ఇందులో వాస్తవం ఎంతన్నది త్వరలోనే తెలుస్తుంది.