ప్రభాస్ కొత్త సినిమా టైటిల్ 'ఆదిపురుష్'!
- టైటిల్ లోగో విడుదల
- ఓమ్ రౌత్ దర్శకత్వంలో చిత్రం
- ఇన్ స్టాగ్రామ్ లో లోగో విడుదల చేసిన ప్రభాస్
'ఎ' అనే అక్షరంలో వీర హనుమాన్ చిత్రం, కొందరు రాక్షసుల చిత్రాలు ఎంబోజ్ అయి ఉన్నాయి. కొన్ని పురాతన ఆలయాల చిత్రాలు, విల్లెక్కు పెట్టిన యోధుడి నీడ కనిపిస్తోంది. కాగా, ఈ చిత్రానికి ఓమ్ రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ-సీరీస్ ఫిలిమ్స్, రెట్రో ఫిలిస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. దీనిని త్రీడీ ఫార్మాట్ లో నిర్మిస్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకునే ఈ చిత్రాన్ని ఆ ఆ తర్వాత ఇతర భాషల్లోకి డబ్ చేస్తారు. ఇది పౌరాణిక చిత్రంగా, మహా విష్ణువు తొలి అవతారం ఆధారంగా రూపొందుతుందని సమాచారం.