'పుష్ప'లో స్పెషల్ సాంగులో బాలీవుడ్ భామ!
- 'సాహో'లో నటించిన శ్రద్ధా కపూర్
- బన్నీ, సుకుమార్ కాంబోలో 'పుష్ప'
- ఐటం పాట కోసం శ్రద్ధా కపూర్
ఇక తన ప్రతి చిత్రంలోనూ ఓ ఐటం సాంగును పెట్టే దర్శకుడు సుకుమార్ ఇందులో కూడా మంచి జోష్ తో కూడిన ఐటం పాటను ప్లాన్ చేస్తున్నాడట. ఇందులో నటించడానికి పలువురు కథానాయికలను పరిశీలించిన మీదట శ్రద్ధా కపూర్ ను సంప్రదించినట్టు, ఇది చేయడానికి ఆమె అంగీకరించినట్టు టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఇందుకు గాను ఆమెకు భారీ మొత్తంలో పారితోషికాన్ని ఆఫర్ చేశారట. అన్నట్టు, ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటిస్తోంది.