బాలు సర్ విషమ పరిస్థితిని అధిగమించారు: రజనీకాంత్
- కరోనా బారినపడిన ఎస్పీ బాలు
- కొన్నిరోజులుగా ఐసీయూలో చికిత్స
- వీడియో సందేశం వెలువరించిన రజనీ
"ఐదు దశాబ్దాలకు పైగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు అనే భాషల్లో పాటలు పాడారు. తన మధురమైన కంఠస్వరంతో కోట్లాదిమందిని అలరించారు. ఇప్పుడాయన కరోనా వైరస్ కలిగించిన విషమ పరిస్థితిని అధిగమించారని తెలిసింది. ఈ వార్త వినగానే నాకు ఎంతో సంతోషం కలిగింది. ఇంకా ఐసీయూలోనే ఉన్న ఆయన త్వరగా కోలుకోవాలంటూ సర్వశక్తిమంతుడైన ఆ భగవంతుడ్ని ప్రార్థించాను" అంటూ తన వీడియోలో పేర్కొన్నారు.