జగన్ మోసగాడు.. దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి: హర్షకుమార్ సవాల్
- దళితులపై దాడి జరుగుతుంటే పట్టనట్టు వ్యవహరిస్తున్నారు
- అమరావతే రాజధాని అని చెప్పి మోసం చేశారు
- ఎన్నికల్లో గెలిస్తే రాజధానిని మార్చుకోండి
జగన్ కు సిగ్గు, దమ్ము ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని... ఎన్నికల్లో మెజార్టీ వస్తే అమరావతిని మార్చుకోవచ్చని సవాల్ విసిరారు. విజయవాడలో ప్రైవేట్ కోవిడ్ సెంటర్లో జరిగిన ప్రమాదం గురించి మాట్లాడుతూ... లక్షల రూపాయలు పెట్టి ట్రీట్మెంట్ పొందుతున్న వారు చనిపోతే రూ. 50 లక్షల పరిహారం ప్రకటించారని... ఎస్సై కొడితే ప్రాణాలు కోల్పోయిన కిరణ్ కు రూ. 10 లక్షలు ముష్టి వేస్తావా? అని జగన్ పై మండిపడ్దారు.