మరోసారి 'రంగస్థలం' కాంబినేషన్?
- చరణ్, సుకుమార్ కాంబోలో వచ్చిన 'రంగస్థలం'
- ఆర్టిస్టుగా చరణ్ కి మంచి పేరు తెచ్చిన చిత్రం
- చరణ్ కోసం స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్న సుక్కూ
ఇప్పుడీ కాంబినేషన్ లో మరో సినిమా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం బన్నీతో 'పుష్ప' చిత్రాన్ని చేస్తున్న సుకుమార్ ఈ లాక్ డౌన్ కారణంగా ఏర్పడిన ఖాళీ సమయంలో ఓ స్క్రిప్టుపని కానిస్తున్నాడట. చరణ్ ని దృష్టిలో పెట్టుకుని ఈ కథను ఆయన సిద్ధం చేస్తున్నట్టు చెబుతున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే కనుక, బహుశా 'పుష్ప' తర్వాత సుకుమార్ తన తదుపరి చిత్రాన్ని చరణ్ తోనే చేసే అవకాశం వుందని సమాచారం!