త్వరలోనే పూర్తిగా కోలుకుని ఇంటికి వస్తా.. ఎవరూ ఆందోళన చెందొద్దు: మంత్రి బాలినేని
- మంత్రి బాలినేనికి కరోనా పాజిటివ్
- హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స
- ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానన్న బాలినేని
ఈ సందర్భంగా బాలినేని స్పందించారు. తనకు కరోనా సోకిందని చెప్పారు. అపోలో ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నానని... ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. పూర్తిగా కోలుకుని త్వరలోనే ఇంటికి వస్తానని చెప్పారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందొద్దని అన్నారు.