మహేశ్ సినిమాలో మరో నాయికగా బాలీవుడ్ నటి?
- మహేశ్ తాజా చిత్రం 'సర్కారు వారి పాట'
- ప్రధాన కథానాయికగా కీర్తి సురేశ్
- సెకండ్ హీరోయిన్ పాత్రకు అనన్య పాండే
పరశురాం దర్శకత్వంలో మహేశ్ 'సర్కారు వారి పాట' అనే చిత్రంలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. బ్యాంక్ లలో జరిగే బడా మోసాల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుంది. ఇక ఇందులో ఇప్పటికే ప్రధాన కథానాయికగా కీర్తి సురేశ్ నటిస్తోంది. ఈ విషయాన్ని కీర్తి ఇప్పటికే ప్రకటించింది కూడా.
ఇక ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా వుందట. దాని కోసం అనన్యను సంప్రదిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ద్వారా అనన్య పాండే టాలీవుడ్ కి పరిచయం అవుతోంది.