సోనూ సూద్ ‘హీరో’ అవుతాడని ‘పూరి’కి ముందే ఎలా తెలిసిందబ్బా!
- వైరల్ అవుతున్న ‘ఏక్ నిరంజన్’ సినిమాలోని క్లిప్
- హీరోను తానేనంటూ సోను డైలాగ్
- సోనూ సూద్ ఎప్పుడూ హీరోనే అంటూ పూరి రిప్లై
ఈ వీడియోను పోస్టు చేసిన నెటిజన్లు.. సోనూ సూద్ ఎప్పటికైనా జనంతో హీరో అనిపించుకుంటాడని మీరు ముందే ఊహించి ఈ డైలాగ్ రాసినట్టు ఉందని ప్రశంసించారు. దీనికి పూరి స్పందిస్తూ.. ‘‘నాకు తెలుసు.. సోనూ సూద్ ఎప్పుడూ హీరోనే’’ అంటూ రిప్లై ఇచ్చారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.