ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు: అనసూయ
- హీరో సుమంత్ అశ్విన్ తల్లి పాత్రలో అనసూయ నటిస్తోందని వార్త
- టీవీ షూటింగులకే హాజరు కావడం లేదన్న అనసూయ
- కరోనా వల్ల షూటింగులకు వెళ్లడం లేదని వ్యాఖ్య
నాగ్ అశ్విన్ హీరోగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అశ్విన్ తల్లిదండ్రులుగా ఇంద్రజ, శ్రీకాంత్ ను తీసుకున్నారు. అయితే, చెన్నైలో ఉంటున్న ఇంద్రజ కరోనా కారణాలతో హైదరాబాద్ షూటింగుకు రాలేనని చెప్పింది. దీంతో, ఆమె స్థానంలో అనసూయను తీసుకున్నారనే వార్తలు వచ్చాయి.