తమిళనాడులో పట్టుబడ్డ డబ్బుపై వివరణ ఇస్తూ వీడియో విడుదల చేసిన బాలినేని!
- కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదు
- అది ఫోటోస్టాట్ కాపీ మాత్రమే
- అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించండి
- ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని
తనకు తెలిసినంత వరకూ కారుపై ఉన్న స్టిక్కర్ ఒరిజినల్ కాదని, జిరాక్స్ కాపీ అని వ్యాఖ్యానించారు. ఆ వాహనం తమిళనాడులో రిజిస్టర్ అయిందని గుర్తు చేసిన ఆయన, స్టిక్కర్ ఫోటోస్టాట్ కాపీ అని, దీన్ని మీడియా వారు పరిశీలిస్తే, వారే గుర్తించగలరని అన్నారు. ఈ డబ్బు తనకు సంబంధించినది మాత్రం కాదని, అన్ని కోణాల్లోనూ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. తప్పు ఎవరిదైనా శిక్షించాలని డిమాండ్ చేశారు.