షూటింగులు వద్దు బాబోయ్ అంటున్న టాప్ యాంకర్లు!
- ఎంటర్టైన్ మెంట్ రంగంపై కరోనా పంజా
- కరోనా బారిన పడ్డ పలువురు బుల్లితెర నటులు
- షూటింగులకు దూరంగా ఉండాలనుకుంటున్న సుమ, అనసూయ
తెలుగు బుల్లితెర స్టార్లుగా వెలుగొందుతున్న యాంకర్లు సుమ, అనసూయ కూడా షూటింగులు వద్దు బాబోయ్ అంటున్నారు. పరిస్థితి అదుపులోకి వచ్చేంత వరకు మరికొన్ని రోజుల పాటు షూటింగులకు దూరంగా ఉండాలని వీరు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇక సినిమాల విషయానికి వస్తే... షూటింగులు దాదాపు ప్రారంభం కాలేదనే చెప్పుకోవాలి. రెండు, మూడు సినిమాల షూటింగులు జరుగుతున్నప్పటికీ... ఇతర ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కలేదు. ముఖ్యంగా షూటింగులకు రావడానికి హీరోలు సుముఖంగా లేరని తెలుస్తోంది. అనవసరమైన రిస్క్ ఎందుకనే భావనలో సినీ ప్రముఖులు ఉన్నారు.