సుశాంత్ సింగ్ కేసు విచారణ ప్రక్రియకు ముగింపు పలికేందుకు అధికారుల నిర్ణయం
- సుశాంత్ ఆత్మహత్య కేసులో విచారణ పూర్తి?
- దాదాపు 35 మందిని ప్రశ్నించిన పోలీసులు
- సమగ్ర నివేదికను రూపొందిస్తున్న అధికారులు
ఈ కేసులో సుశాంత్ సింగ్ కుటుంబ సభ్యులతో పాటు ఆయన సన్నిహితులు, సినీ పరిశ్రమలోని కొందరిని అధికారులు విచారించారు. సుశాంత్ సింగ్ గదిలోని వస్తువులనూ స్వాధీనం చేసుకుని విచారణ కొనసాగించారు. ఈ కేసులో విచారణ ప్రక్రియను ఇక ముగించాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు చేసిన విచారణలో ఆత్మహత్యకు సంబంధించిన ఎటువంటి విషయాలు బయటకు రాలేదని పోలీసులు చెబుతున్నారు. సుశాంత్ మరణంపై సమగ్ర నివేదికను రూపొందిస్తున్నామన్నారు. దీన్ని మరికొన్ని రోజుల్లో వారు ఉన్నతాధికారులకి అప్పగించి కేసును ముగించనున్నట్లు తెలిసింది.