సినిమా సెట్లో భౌతిక దూరం పాటించడం అన్నది కష్టం.. జరగదు: బాలీవుడ్ దర్శకుడు అనుభవ్ సిన్హా
- ఇప్పటికిప్పుడు షూటింగులను ప్రారంభించాలని అనుకోవడం లేదు
- సెట్లో భౌతిక దూరం పాటిస్తామని చెప్పడం అబద్ధం
- ఈ పరిస్థితుల్లో షూటింగులకు ఖర్చు తడిసి మోపెడవుతుంది
షూటింగులు ప్రారంభించినా ఖర్చు తడిసిమోపెడు అవుతుందని, సెట్లో నటీనటులకు రక్షణ కల్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సినిమా సెట్లో భౌతిక దూరం పాటించడమంటే రెండు పరస్పర విరుద్ధ విషయాలను కలపడమేనని అన్నారు. సెట్లో భౌతిక దూరం పాటిస్తామని ఎవరైనా చెబితే అది అబద్ధమే అవుతుందని అనుభవ్ సిన్హా తేల్చి చెప్పారు.