రామ్ తాజా చిత్రానికి ఓటీటీ నుంచి భారీ ఆఫర్
- థియేటర్లకు ప్రత్యామ్నాయంగా నిలిచిన ఓటీటీ
- రామ్ నటించిన 'రెడ్'కు 30 కోట్ల ఆఫర్
- థియేటర్లకే మొగ్గు చూపుతున్న నిర్మాతలు
ఈ క్రమంలో ఎనర్జిటిక్ హీరోగా పేరుతెచ్చుకున్న రామ్ తాజా చిత్రం 'రెడ్'కు కూడా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇటీవల ఓ స్ట్రీమింగ్ సంస్థ నుంచి 25 కోట్ల ఆఫర్ రాగా, తాజాగా మరో సంస్థ నుంచి 30 కోట్ల ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే, నిర్మాతలు మాత్రం ఓటీటీ వేదికలకు ఇవ్వకూడదని, ఆలస్యమైనా థియేటర్లోనే విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట.
ముఖ్యంగా హీరోలు తమ సినిమాలు ముందుగా థియేటర్లోనే రిలీజ్ కావాలని కోరుకుంటారు. అందుకే, నిర్మాతలు ముందుగా స్ట్రీమింగ్ కు ఇవ్వడం లేదని తెలుస్తోంది. ఇదిలావుంచితే, తిరుమల కిశోర్ దర్శకత్వంలో రూపొందిన ఈ 'రెడ్' చిత్రంలో మాళవిక శర్మ హీరోయిన్ గా నటించింది. 'ఇస్మార్ట్ శంకర్' హిట్ తర్వాత రామ్ నటించిన చిత్రం ఇది.