చైనాపై డిజిటల్ స్ట్రయిక్ జరిపాం: కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
- దేశ ప్రజల డేటాకు భద్రత కల్పించడానికి యాప్‌ల నిషేధం
- భారత్ శాంతికాముక దేశం
- మన దేశంపై ఎవరి కన్ను పడినా వారికి బుద్ధి చెబుతాం
గాల్వన్‌లోయ వద్ద చైనా దుందుడుకు చర్యలకు ప్రతిగా తీసుకున్న ఈ చర్యను రవి శంకర్ ప్రసాద్ డిజిటల్ స్ట్రయిక్‌గా అభివర్ణించారు. చైనా యాప్‌లను నిషేధిస్తూ తీసుకున్న చర్యలను ఇటీవల కొన్ని మీడియా సంస్థలు కూడా డిజిటల్ స్ట్రయిక్‌గా పేర్కొన్న విషయం తెలిసిందే. పాక్‌లోని ఉగ్రమూకలపై గతంలో భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చైనాపై తీసుకున్న చర్యలను డిజిటల్ స్ట్రయిక్‌గా పేర్కొంటున్నారు.