తండ్రీకొడుకుల లాకప్ మరణంపై రజనీకాంత్ ఆవేదన
- తండ్రీకొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- రెండు రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి
- ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలన్న రజనీకాంత్
ఈ ఘటనపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కేసును విచారించిన హైకోర్టు... ఈ కేసును సీబీఐ స్వీకరించేంత వరకు సీఐడీకి అప్పగించాలని ఆదేశించింది. ఈ ఘటనపై సినీ నటుడు రజనీకాంత్ స్పందించారు. కొందరు పోలీసులు ప్రవర్తించిన తీరు తనకు ఆశ్చర్యకరంగా ఉందని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.