కీర్తి సురేశ్ కు కంగ్రాట్స్ చెప్పిన రష్మిక
- కీర్తి సురేశ్ కథానాయికగా 'పెంగ్విన్'
- ఓటీటీ ద్వారా విడుదలైన సినిమా
- సినిమా చూసిన రష్మిక ప్రశంసలు
ఇక ప్రస్తుతం షూటింగులు లేకపోవడంతో ఖాళీగా వున్న రష్మిక మందన్న ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో చూసింది. ఆ వెంటనే తన ఇన్ స్టా వేదికగా ఈ ముద్దుగుమ్మ ఆ చిత్రంపై ప్రశంసలు కురిపించింది. 'రాత్రి పెంగ్విన్ చూశాను.. కీర్తీ, నువ్వు కీలకం.. ఎప్పటిలానే నీ అభినయం అద్భుతం. ఈ సినిమా అందరు తల్లులకూ సంబంధించింది. ఈశ్వర్, సుబ్బరాజు సర్.. అందరికీ అభినందనలు' అంటూ రష్మిక ఎటువంటి భేషజాలు లేకుండా తన ప్రశంసలు కురిపించింది.