ఒక కుక్క మనిషిని ఇంతలా ప్రేమిస్తుందా? అంటూ నాగబాబు వీడియో
- కుక్కలపై అభిప్రాయాలు వ్యక్తం చేసిన నాగబాబు
- తన ఇంట్లో కుక్కలను పేర్లతో సహా పరిచయం చేసిన వైనం
- విదేశాల్లో జరిగిన ఓ ఘటనను ప్రస్తావించిన మెగాబ్రదర్
ఇటీవల విదేశాల్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేస్తుండగా, అతడి కుక్క పోలీసులపైకి లంఘించగా, పోలీసులు ఆ కుక్కను తుపాకీతో కాల్చిన ఘటనను నాగబాబు ప్రస్తావించారు. ఆ ఘటన చూడగానే గుండెల్లో కలుక్కుమందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కుక్క మనిషిని ఇంతలా ప్రేమిస్తుందా అని వ్యాఖ్యానించారు. ఆదిమానవుడు గుహల్లో జీవించిన కాలం నుంచి కుక్కలు అలవాటయ్యాయని, జీవితంలో మనిషి ఒక్కసారైనా కుక్కను పెంచకపోతే జీవితం సంపూర్ణం కాదని పేర్కొన్నారు.