బాలీవుడ్ కు దూరం కావడానికి కారణం ఇదే: రమ్యకృష్ణ
- బాలీవుడ్ లో నేను నటించిన సినిమాలు హిట్ కాలేదు
- దాంతో నాకు అవకాశాలు రాలేదు
- దక్షిణాదిలో మాత్రం సక్సెస్ అయ్యాను
అందం, అభినయం కలగలిసిన రమ్యకృష్ణ... హీరోయిన్ గా బాలీవుడ్ లో మాత్రం విజయవంతం కాలేకపోయింది. కానీ, ఇప్పుడు పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ 'ఫైటర్' ద్వారా రమ్య మరోసారి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది.
ఈ సందర్భంగా ఓ ఆంగ్ల మీడియాతో రమ్యకృష్ణ మాట్లాడుతూ బాలీవుడ్ లో ఎందుకు సక్సెస్ కాలేకపోయిందో వివరించింది. బాలీవుడ్ లో తాను నటించిన చిత్రాలు విజయవంతం కాలేకపోయాయని చెప్పింది. సినిమాలు ఫ్లాప్ కావడంతో తనకు అవకాశాలు రాలేదని తెలిపింది. ఈ కారణం వల్లే బాలీవుడ్ కు దూరమయ్యానని... దక్షిణాదిలో మాత్రం సక్సెస్ అయ్యానని చెప్పింది.