సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వదిన హఠాన్మరణం!
- సుశాంత్ మరణాన్ని తట్టుకోలేకపోయిన సుధా దేవి
- మరణ వార్త తెలిసినప్పటి నుంచి అన్నం తినక నీరసం
- అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే కుప్పకూలి మరణం
ముంబయిలో సుశాంత్ అంత్యక్రియలు జరుగుతున్న సమయంలోనే ఆమె కుప్పకూలి మరణించిందని తెలుస్తోంది. తననెంతో ఆప్యాయంగా చూసుకునే సుశాంత్ మరణాన్ని ఆమె తట్టుకోలేకపోయిందని, సుశాంత్ మరణ వార్త విన్న తరువాత ఆమె ఆహారం తీసుకోవడం మానేసిందని 'ది టైమ్స్ ఆఫ్ ఇండియా' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. కాగా, సుశాంత్ అంత్యక్రియలు సోమవారం నాడు ముంబయిలోని విల్లే పార్లే పరిధిలో ఉన్న పవన్ హాన్స్ శ్మశానవాటికలో నిర్వహించారు.