బాలకృష్ణ కోపం నిమిషం మాత్రమే... ఆయన మాటలకు ఎవరూ బాధపడొద్దు: పోసాని
- బాలయ్య మాటలతో ఎవరికీ నష్టంలేదన్న పోసాని
- తాను బాలయ్య మాటలను తేలిగ్గా తీసుకుంటానని వెల్లడి
- మరో పదేళ్లు కూడా జగనే సీఎం అంటూ వ్యాఖ్యలు
పోసాని ఈ సందర్భంగా బాలయ్యపై కాస్తంత వ్యంగ్యం కూడా ప్రదర్శించారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండలేదని బాలయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ, ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని బాలకృష్ణ కలలు కంటున్నాడని, ఇప్పుడు ఏపీ సీఎం ఎన్టీఆర్ కాదని... జగన్ అని స్పష్టం చేశారు. జగన్ ఒకరికి వెన్నుపోటు పొడవడు, తాను పొడిపించుకోడని, కాబట్టి ఐదేళ్లపాటే కాదు, పదేళ్లు సీఎంగా జగనే ఉంటాడని వివరించారు.