నిన్న సాయంత్రం వరకు మాపై ప్రభుత్వ ఒత్తిడి ఉంది: డాక్టర్ సుధాకర్ తల్లి
- డాక్టర్ సుధాకర్ డిశ్చార్జి కావొచ్చంటూ హైకోర్టు తీర్పు
- తీర్పుపై ఆనందంగా ఉందన్న డాక్టర్ సుధాకర్ తల్లి
- సుధాకర్ ను మరో ఆసుపత్రిలో చేర్చుతామని వెల్లడి
ఈ వ్యవహారం మొత్తంలో తన బిడ్డకు జరిగిన అన్యాయాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని, నిన్న సాయంత్రం వరకు తమపై ప్రభుత్వం వైపు నుంచి ఒత్తిడి ఉందని అన్నారు. తమకు అండగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. సీబీఐ కూడా న్యాయం చేస్తుందన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. మరోసారి అవకాశం వస్తే సీబీఐకి మరిన్ని విషయాలు చెబుతానని ఆమె అన్నారు.