రాష్ట్ర ఆవిర్భావం రోజున ఇంతకంటే దారుణం ఉంటుందా?: కేసీఆర్ ప్రభుత్వంపై ఉత్తమ్ ఫైర్
- నేడు రాష్ట్రవ్యాప్తంగా జలదీక్షకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు
- ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేస్తున్న పోలీసులు
- తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా? అని ప్రశ్న
శాంతియుతంగా తాము చేయాలనుకున్న కార్యక్రమాలను అడ్డుకోవద్దని కోరారు. మాట్లాడితే అరెస్ట్ చేస్తున్నారని, తెలంగాణను తెచ్చుకున్నది ఇందుకేనా? అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఓ నియంత పాలిస్తున్నారని ఉత్తమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాగా, ఉత్తమ్‌ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్‌కే చెందిన మరో సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నేతల గృహ నిర్బంధాలపై మండిపడ్డారు. కేసీఆర్ నియంత పోకడలకు ఇది నిదర్శనమన్నారు.