రమేశ్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడి'గా రవితేజ!
- ఇటీవలి కాలంలో హిట్లకు దూరమైన రవితేజ
- రమేశ్ వర్మ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు
- ద్విపాత్రాభినయం చేయనున్న రవితేజ
ఈ క్రమంలో తాజాగా రమేశ్ వర్మ దర్శకత్వంలో ఓ చిత్రం చేయడానికి రవితేజ సమాయత్తమవుతున్నాడు. ఈ సినిమా ఆగిపోయిందంటూ ఇటీవల ప్రచారం జరిగినప్పటికీ, అదంతా ఒట్టిదేనని యూనిట్ పేర్కొంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేయనుండడం మరో విశేషంగా చెబుతున్నారు.
ఇదిలావుంచితే, ఈ చిత్రానికి తాజాగా 'ఖిలాడి' అనే టైటిల్ని నిర్ణయించినట్టు తెలుస్తోంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి ఈ టైటిల్ సరిగ్గా సరిపోతుందని అంటున్నారు. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయి.