రేపు ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లకూడదని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నిర్ణయం!
- రేపు దివంగత ఎన్టీఆర్ జయంతి
- కరోనా నేపథ్యంలో ఘాట్ కు వెళ్లకూడదని తారక్, కల్యాణ్ రామ్ నిర్ణయం
- ఇంటి వద్ద నుంచే తాతకు నివాళి అర్పించనున్న వైనం
అయితే రేపు ఎన్టీఆర్ ఘాట్ ను జూనియర్ ఎన్టీఆర్, ఆయన సోదరుడు కల్యాణ్ రామ్ సందర్శించడం లేదు. ఇంటి వద్ద నుంచే తమ తాతగారికి వారు నివాళి అర్పించనున్నారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్న నేపథ్యంలో వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తాము ఘాట్ వద్దకు వస్తే అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ గుమికూడే అవకాశం ఉన్న నేపథ్యంలో, వారు రేపు ఘాట్ కు రాకూడదని నిర్ణయించుకున్నారు.