జూలై నుంచి షూటింగుకి పవన్ కల్యాణ్
- గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్'
- బాలీవుడ్ సినిమా 'పింక్'కి రీమేక్
- లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన షూటింగ్
- జూలై నుంచి షూటింగ్ ప్లానింగ్
ఇక ఇప్పుడు ఒక్కొక్కటీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి సినిమా షూటింగులు కూడా మొదలవుతాయి. ఈ నేపథ్యంలో పవన్ నటిస్తున్న 'వకీల్ సాబ్' చిత్రం షూటింగును మాత్రం జూలై నుంచి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నారు. వైరస్ వ్యాప్తి బాగా అదుపులోకి వచ్చాకనే షూటింగును పెట్టుకుందామని పవన్ నిర్మాతకు చెప్పారట. దాంతో జూలై నుంచి ఈ షూటింగ్ మొదలవ్వచ్చు. బాలీవుడ్ లో హిట్టయిన 'పింక్'కి రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీరాం వేణు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు.