నాగబాబూ... నీ తెలివితక్కువ తనంతో చిరంజీవి పరువు తీయొద్దు: ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి
- గాడ్సే నిజమైన దేశభక్తుడు అన్న నాగబాబు
- వెల్లువెత్తుతున్న విమర్శలు
- తప్పుగా అర్థం చేసుకోవద్దని మరో ట్వీట్ చేసిన నాగబాబు
నాథూరాం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు ట్వీట్ చేస్తూ... నాథూరాం గాడ్సే వైపు వాదనను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదని అన్నారు. ఆనాటి ప్రభుత్వానికి లోబడే అప్పటి మీడియా పని చేసిందని చెప్పారు. గాంధీని చంపితే అపఖ్యాతి పాలవుతామని తెలిసి కూడా... గాడ్సే అనుకున్నది చేశారని అన్నారు. పాపం నాథూరాం గాడ్సే అని కామెంట్ కూడా చేశారు.
అయితే, ఆ తర్వాత అనేక విమర్శలు రావడంతో... తనను తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరుతూ మరో ట్వీట్ చేశారు. గాడ్సేని తాను సమర్థించలేదని... ఆయన వెర్షన్ కూడా ప్రజలకు తెలియాలని మాత్రమే అన్నానని చెప్పారు. గాంధీ అంటే తనకు ఎంతో గౌరవమని అన్నారు.