సురేందర్ రెడ్డితో మళ్లీ చరణ్ సినిమా!
- గతంలో వీరి కలయికలో 'ధృవ'
- స్టయిల్ నచ్చడంతో 'సైరా'కు ఛాన్స్
- ప్రస్తుతం జరుగుతున్న కథా చర్చలు
ఇక ఇప్పుడు తను రాజమౌళితో చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' తర్వాత చేయడానికి ఇంకా ఏ చిత్రం కమిట్ కాలేదు. పలువురు దర్శకులు చెబుతున్న కథలు వింటున్నప్పటికీ, ఎవరికీ ఆయన ఓకే చెప్పలేదు. ఈ నేపథ్యంలో సురేందర్ రెడ్డితో మరో సినిమా చేయాలని చరణ్ నిర్ణయించుకున్నాడని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన కథా చర్చలు కూడా ప్రస్తుతం జరుగుతున్నట్టు, 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఇదే సెట్స్ కి వెళ్లనున్నట్టూ సమాచారం.