'పోకిరి' డైలాగ్ చెప్పిన డేవిడ్ వార్నర్... అతిథి పాత్ర ఆఫర్ చేసిన పూరీ జగన్నాథ్
- 'ఒక్కసారి కమిటైతే' డైలాగ్ తో అదరగొట్టిన వార్నర్
- ఈ డైలాగ్ వార్నర్ కు బాగా సరిపోతుందన్న పూరీ
- 'లవ్యూ' అంటూ అభినందనలు
"ఒక్కసారి కమిటైతే నా మాట నేనే వినను" అంటూ తనదైన శైలిలో డైలాగ్ చెప్పాడు. "ఇది ఏ సినిమా డైలాగ్ అని అందరినీ అడిగాను" అంటూ ట్వీట్ చేశాడు. దీనిపై పోకిరి చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ స్పందించారు. "డేవిడ్... ఈ డైలాగ్ నీకు సరిగ్గా సరిపోతుంది. మొండిపట్టుదల, దూకుడు కలగలిసిన వ్యక్తివి నీవు. నటుడిగానూ నువ్వు సూపరబ్బా. నా చిత్రంలో ఓ చిన్న పాత్ర పోషిస్తావని అనుకుంటున్నా. లవ్యూ వార్నర్" అంటూ ట్వీట్ చేశారు.