నిర్మాతగా మహేశ్ బాబు .. హీరోగా విజయ్ దేవరకొండ?
- హీరోగా వరుస విజయాలు
- నిర్మాతగా ఇతర హీరోలతో సినిమాలు
- దూకుడు పెంచుతున్న మహేశ్ బాబు
ఇక ఆ తరువాత సినిమాను ఆయన విజయ్ దేవరకొండ హీరోగా నిర్మించనున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టును గురించిన వివరాలను వెల్లడి చేయనున్నారని చెబుతున్నారు. ఆ వెంటనే కార్తీ హీరోగా ఒక సినిమాను నిర్మించడానికి మహేశ్ బాబు సన్నాహాలు చేయిస్తున్నాడని అంటున్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఆయన వున్నాడని చెబుతున్నారు. ఇటు హీరోగానే కాదు .. అటు నిర్మాతగా కూడా మహేశ్ బాబు తన దూకుడు పెంచుతున్నాడన్న మాట.