ప్రభాస్ 20వ చిత్రం ప్రారంభోత్సవం ఫొటోలు పోస్టు చేసిన దర్శకుడు రాధాకృష్ణ
- జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ చిత్రం
- పూజా హెగ్డే కథానాయిక
- ఇప్పటివరకు మీడియాలో కనిపించని ముహూర్తం ఫొటోలు
- లాక్ డౌన్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఫొటోలు పంచుకున్న దర్శకుడు
ఈ సినిమా ఓపెనింగ్ కు సంబంధించిన ఫొటోలేవీ అప్పట్లో మీడియాలో రాలేదు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు రాధాకృష్ణ నాడు సినిమా ముహూర్తం షాట్ సందర్భంగా తీసిన ఫొటోలను తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. కాగా, ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్ అనంతరం పునఃప్రారంభం కానుంది.

