గీతా మాధురి అక్కడ ఇబ్బంది పడుతుందని నేను ముందే అనుకున్నా: నందూ
- గీత వ్యక్తిత్వం గురించి ఎవరికీ తెలియదు
- బిగ్ బాస్ తొలి వారంలో చాలా ఇబ్బంది పడింది
- ఆ తర్వాత ఆమెను అందరూ అర్థం చేసుకున్నారు
బిగ్ బాస్ లో గీత ఇబ్బంది పడుతుందని తాను ముందే అనుకున్నానని నందూ చెప్పాడు. తాను అనుకున్నట్టే తొలి వారంలో ఆమె చాలా ఇబ్బంది పడిందని తెలిపాడు. సోషల్ మీడియాలో కూడా ఆమెపై విమర్శలు మొదలయ్యాయని చెప్పాడు. ఆ తర్వాత నెమ్మదిగా ఆమెను అందరూ అర్థం చేసుకున్నారని... అందరికీ మంచి స్నేహితురాలు అయిందని తెలిపాడు.