ఇకపై అలాంటి పాత్రలు చేయను: హీరోయిన్ రాశి ఖన్నా
- ఆ పాత్రను చేసి వుండకూడదు
- పేరెంట్స్ ను ఇబ్బంది పెట్టే పాత్రలు చేయను
- ఇకపై హద్దులు దాటే సీన్స్ చేయనన్న రాశి ఖన్నా
ఆమె అంతగా రిస్క్ చేసినా ఆ పాత్రకి ఎలాంటి గుర్తింపు రాకపోవడం నిరాశను కలిగించే విషయమే. ఆ సినిమా విజయవంతం కాకపోవడం ఆమెను మరింత డీలాపడేలా చేసింది. ఆ పాత్రను గురించి తాజాగా రాశి ఖన్నా స్పందిస్తూ .. "ఆ సినిమాలో నేను ఆ పాత్రను చేసి వుండకూడదు. ఆ పాత్రను ఒప్పుకుని ఒక రకంగా పొరపాటు చేశాను. నేను చేసిన ఆ పాత్ర నా పేరెంట్స్ ను కూడా బాధపెట్టిందని గ్రహించాను. అలాంటి పాత్రలను చేయకూడదనీ, గ్లామర్ పరంగా హద్దులు దాటని పాత్రలు మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను" అని చెప్పుకొచ్చింది.