ప్రకాశ్ రాజ్ తనయుడి మామిడి కాయల వ్యాపారం!
- దేశవ్యాప్తంగా లాక్ డౌన్
- ఫాంహౌస్ లో ఉంటున్న ప్రకాశ్ రాజ్ ఫ్యామిలీ
- కొడుకు ఫొటో ట్వీట్ చేసిన నటుడు
ఈ నేపథ్యంలో ఆయన సోషల్ మీడియాలో ఆసక్తికరమైన ఫొటో పంచుకున్నారు. అందులో ప్రకాశ్ రాజ్ కుమారుడు వేదాంత్.. చుట్టూ మామిడి కాయలు పెట్టుకుని అమ్ముతున్న వాడిలా కనిపిస్తున్నాడు. అవన్నీ కూడా ప్రకాశ్ రాజ్ తోటలో కాసినవే. "నా బిడ్డ... మామిడి కాయల వ్యాపారి! మా వ్యవసాయ క్షేత్రంలో ప్రకృతితో సంభాషిస్తున్నా. ఇంటి వద్దే ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ విపత్తు సమసిపోతుంది" అంటూ ట్వీట్ చేశారు.