గొప్ప అభిమానిని పొందినందుకు సంతోషంగా వుంది: అనసూయ
- మా అమ్మగారు సినిమాలు చూడరు
- ఆ మధ్య 'రంగస్థలం' మాత్రం చూశారు
- అప్పటి నుంచి మీ అభిమానిగా మారిపోయారన్న నెటిజన్
తాజాగా ఒక అభిమాని ఆమెతో మాట్లాడుతూ .. "మా అమ్మగారు పెద్దగా సినిమాలు చూడదు. అందువలన సినిమా తారల్లో ఆమె ఇష్టపడేవారు కూడా ఎవరూ లేరు. అలాంటి మా అమ్మగారు ఆ మధ్య 'రంగస్థలం' సినిమా చూశారు. అప్పటి నుంచి ఆమె మీ అభిమానిగా మారిపోయారు. ఈ స్థాయిలో మా అమ్మగారి అభిమానాన్ని పొందినవారు లేరు" అంటూ రాసుకొచ్చాడు. అందుకు అనసూయ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ .. "మీ అమ్మగారికి నా ధన్యవాదాలు తెలియజేయండి .. ఇంతగొప్ప అభిమానిని పొందినందుకు ఆనందంగా వుంది" అంటూ అనసూయ సమాధానమిచ్చింది.