సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- మంచి మనసు చాటుకున్న తమన్నా
- కొరటాల సినిమాలో యంగ్ హీరో
- మెరుగులు దిద్దుతున్న త్రివిక్రమ్
* ప్రస్తుతం చిరంజీవితో 'ఆచార్య' చిత్రాన్ని చేస్తున్న ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తన తదుపరి చిత్రాన్ని కొత్తతరం హీరోతో చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో నాని కానీ, విజయ్ దేవరకొండ కానీ ఆ చిత్రంలో హీరోగా నటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం వీరిద్దరితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం.
* దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి చిత్రాన్ని ఎన్టీఆర్ తో చేయనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ ప్రాజక్టుకు సంబంధించిన స్క్రిప్టు పనిలో ఆయన బిజీగా ఉన్నాడనీ, తుది మెరుగులు దిద్దుతున్నాడని చెబుతున్నారు.