నెట్ ఫ్లిక్స్ ద్వారా ఈ నెల 25న అందుబాటులోకి వస్తున్న 'భీష్మ'
- నితిన్ - రష్మిక జంటగా వచ్చిన 'భీష్మ'
- ఇద్దరి కెరియర్లోను చెప్పుకోదగిన హిట్
- కాసుల వర్షం ఖాయమంటూ టాక్
థియేటర్స్ లో ఈ సినిమా జోరుగా సాగుతున్న సమయంలోనే కరోనా ఎఫెక్ట్ చూపడం మొదలైంది. ఈ కారణంగానే చాలామంది ఈ సినిమాను థియేటర్స్ లో చూడలేకపోయారు. అలాంటివారిని నెట్ ఫ్లిక్స్ ద్వారా 'భీష్మ' పలకరించనుంది. ఈ నెల 25వ తేదీన ఈ సినిమాను అందుబాటులోకి తీసుకురానున్నారు.
లాక్ డౌన్ కారణంగా ఇంటిపట్టునే వుండిపోయిన తెలుగు ప్రేక్షకులకు ఈ సినిమా పూర్తిస్థాయి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక్కడ కూడా ఈ సినిమా హిట్ అవుతుందనే చెప్పచ్చు!