ఎవరూ చెప్పనవసరం లేదు .. సాయం చేయడం తెలుసు: శ్రుతి హాసన్
- మీరెంతగా సాయపడుతున్నారో తెలుసుకోవాలనుంది
- ఎవరో చెప్పారుగదా అని చేసే అలవాటు నాకు లేదు
- గతంలో సాయపడిన సందర్భాలు చాలానే వున్నాయన్న శ్రుతి
అందుకు శ్రుతి హాసన్ తనదైన శైలిలో స్పందిస్తూ .. "నాకు చెప్పేవారు కరోనా బాధితులకు ఎంతగా సేవ చేస్తున్నారో తెలుసుకోవాలని వుంది. మనం ఇతరులకు ఎంత సహాయం చేస్తే, భగవంతుడు మనకి కూడా అంతగా సహాయం చేస్తాడని నమ్మే వ్యక్తిని నేను. అలాంటి నేను ఎవరితోనూ చెప్పించుకోవాలని చూడను. ఏ సాయమైనా నాకు చెయ్యాలనిపిస్తుంది .. చేస్తాను. అంతేగానీ ఇతరులు ఆదేశించారు గదా అని చేసే అలవాటు మాత్రం లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా, గతంలో నేను సహాయం చేసిన సందర్భాలు చాలానే వున్నాయి" అంటూ సమాధానమిచ్చింది.