పోలీసులు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.. వారిపై ఓ సినిమా తీస్తా: దిల్రాజు
- పోలీసులపై సినిమా తీయాలని ఎప్పటి నుంచే వుంది
- కథ కూడా సిద్ధంగా ఉంది
- ఈ విపత్కాలంలో వారు అందిస్తున్న సేవలకు అభినందనలు
కాగా, నిన్న పోలీసు సిబ్బందికి రక్షణ మాస్కులు, శానిటైజర్లను దిల్రాజు పంపిణీ చేశారు. మెహిదీపట్నం రైతు బజారు వద్ద ఉదయం పోలీసు డిపార్ట్మెంట్కు దిల్ రాజు వీటిని అందజేశారు. ఈ విషయాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ట్వీట్ చేసింది. మనల్ని రక్షించే వారిని కాపాడుకోవడం మన బాధ్యత అని పేర్కొంది. మూడు రోజుల క్రితం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు కూడా దిల్ రాజు మాస్కులు, శానిటైజర్లు అందించారు.